నార్నూర్ : సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటూ పకడ్బందీగా రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని వైద్యాధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగపూర్ గ్రామంలో ఝరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. స్థానికుల వివరాలు నమోదు చేసుకున్నారు.
వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో పరిశుభ్రత లోపిస్తే వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఆడే సంజయ్, ఏఎన్ఎం చంద్రకళ, హెచ్ఏ మోహన్, ప్రకాష్, ఆశా కార్యకర్త నిర్మల ఉన్నారు.