ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా 2021 జులై 4న గ్రీన్ ఇండి యా ఛాలెంజ్‌లో భాగంగా భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లిమ్కాబుక్ రికార్డులో స్థానం సంపాందించగా మంగళవారం హైదరా బాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే జోగు రామన్నకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. రామ న్న బర్త్‌డే సందర్భంగా దుర్గానగర్ అటవీ ప్రాం తంలో గంట వ్యవధిలో 16,900 మందితో 3,54,900 మొక్కలు నాటారు. లిమ్కాబుక్ రికార్డు నిర్వాహకులతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వివిధ శాఖల అధికారుల ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన లిమ్కాబుక్ అధికారులు ఒక్కొక్కరు 21 మొక్కలు నాటినట్లు గుర్తించారు. సామాజిక కృషి, పచ్చదనం పెంపొం దించడం, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిదర్శనమని లిమ్కాబుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాలకౌల్ బెనర్జీ తెలిపారు. ఆవార్డు లభించడం పట్ల ఎమ్మెల్యే జోగు రామన్న సంతోషం వ్యక్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజలు విశేష ఆదరణ లభించిందని, వారి ప్రేమాభిమా నాలతో సాధ్యమైందన్నారు. ఈ అవార్డును వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. లిమ్కాబుక్ అవార్డు రావడంపై ముఖ్యమంతి కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎమ్మెల్యే జోగు రామన్నను అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ, బీఆర్ఎస్ యువ నాయకుడు జోగు మహేందర్, స్వాస్ ప్రతినిధి ప్రణయ్ పాల్గొన్నారు.