బోథ్, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతిని బోథ్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బస్టాండ్‌లోని దీక్షా శిబిరం వద్ద సాధన సమితి సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఎలుక రాజు, సోలంకి సత్యనారాయణ, రమణ, మహ్మద్ రఫీ, వాహెద్, రఫీ, రవి, సంజీవ్ పాల్గొన్నారు. బోథ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నివాళులర్పించారు. సొనాలలో ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు ప్రొఫెసర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
జిల్లా కేంద్రంలో..
ఎదులాపురం,ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోటాంకి సత్యనారాయణ, అన్నదానం జగదీశ్, ప్రమోద్ కుమార్ ఖత్రి, సుభాష్, సంతోష్ సింగజి, తోట పరమేశ్వర్, శ్వదీప్సింగ్, నాందేవ్ గౌడ్, సుభాష్,రాకేశ్ ఉన్నారు.
డీఎంహెచ్‌వో కార్యాలయంలో..
డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 89వ జయంతిని కార్యక్రమాన్ని నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రవీందర్, కార్యాలయ సిబ్బంది వామన్, గోపి తదితరులున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 6 : జై శంకర్ సార్ ఆశయ సాధనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సకల జనుల సమ్మె ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొని సార్ చిత్రపటం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చౌక్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ తొలిదశ మలిదశలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరపురానివన్నారు. సంక్షేమ పథకాలతోపాటు ప్రాజెక్టుల నిర్మాణాలు ఉద్యోగాలు ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, అశోక్ స్వామి, కౌన్సిలర్ భరత్, సాజిదొద్దీన్ పాల్గొన్నారు.
జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు
తాంసి, ఆగస్టు 6 : తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరాటం కోసం పెళ్లి సైతం చేసుకోలేదని, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా పోరాటాలు చేశారన్నారు. ఉద్యమాన్ని దేశ విదేశాలకు తీసుకకెళ్లారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మెరుగు రవీందర్, బీఆర్ఎస్ నాయకులు గంగారాం పాల్గొన్నారు.
సిరికొండ మండలంలో..
ఇచ్చోడ(సిరికొండ), ఆగస్టు 6 : సిరికొండ మండలకేంద్రంలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు, ఉద్యమానికి ఊపిరి పోసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్మదా పెంటన్న, ఉప సర్పంచ్ చిన్న రాజన్న, నాయకులు జింక లక్ష్మణ్, సందీప్, రాజు, మసూద్, అజ్గర్, జహుల్, ఆశరబ్, విఠల్, నర్సయ్య, బిలాల్, రాజు పాల్గొన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్, ఆగస్టు 6 : తెలంగాణ రాష్ట్ర సాదనలో జయశంకర్ సేవలు మరువలేనివని ఐటీడీఏ ఏపీవో జనరల్ భీంరావ్, ఇంజినీరింగ్ ఈఈ భీంరావ్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో జయశంకర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతంపై పట్టున్న జయశంకర్ అనునిత్యం ఉద్యమాన్ని ప్రోత్సహించారన్నారు. ఆయన చూసిన మార్గంలోనే మనం తెలంగాణ సాధించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రాంబాబు, పీటీజీ ఏపీవో భాస్కర్, రమేశ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ప్రభుత్వ కళాశాలలో..
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జయశంకర్ జయంతిని కళాశాల ప్రి న్సిపాల్ పావని నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్, గణేశ్, శ్రీలత, తిరుపతి, వినోద్, కేశవులు, సువర్ణ, శ్రీనివాస్, సుజాత, నవీన్, దశరథ్, కిశోర్, సిబ్బంది సత్యనారాయణ మూర్తి, ప్రకాశ్, శిశికళ, సాయికృష్ణ, లక్ష్మి, అరవింద్, అజిత్‌ఖాన్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 6 : మండలంలోని గంగన్నపేట్ గ్రామ జయశంకర్ చౌక్‌లో ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతకాని, మహ ర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి మహేందర్ నాయకులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో నాయకులు కామ్లే రవికాంత్, అంబాదాస్, ఏమయ్య, రాజ్‌కుమార్, భాలేరావ్, రాహుల్, నరేశ్, సాయికిరణ్, వజీత్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి, ఆగస్టు 6 : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పోటే శోభాబాయి, వైస్ ఎంపీపీ పడ్వాల్గోపాల్సింగ్, ఎంపీడీవో పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూపరింటెండెంట్ వేణు, ఎంపీవో సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటే సాయినాథ్, ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్ మండలంలో..
నార్నూర్,ఆగస్టు 6 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ మహేందర్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీకాంబ్లే, సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని భీంపూర్ పోలీసులు, మండల అధికారులు నిర్వహించారు. సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ రత్నప్రభ, జడ్పీటీసీ సుధాకర్, ఎస్ఐ లాల్‌సింగ్ నాయక్, ఏఎస్ఐ స్వామి, ప్రజాప్రతినిధులున్నా రు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఐతారం ముచ్చట్లు వేదిక కవులు, రచయితల వేదిక కవు లు, రచయితలు వేర్వేరుగా నివాళులర్పించారు. ప్రముఖ కవులు ఉదారి నారాయణ, లక్ష్మీనారాయణ, బాబన్న, అరుణ, నారాయణ గౌడ్, ఏలియా, చిందం ఆశన్న తదితరులున్నారు.