ఆదిలాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(గురువారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ దిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో నిర్వహిం చే ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ల్లో పాల్గొంటారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. ఇక్క డ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు మద్దతు గా నిర్వహించనున్న సభలో పాల్గొంటారు. అ నంతరం బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు.
అక్కడ స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు మద్దతుగా నిర్వహించే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అభ్యర్థులతోపాటు బీఆర్ఎస్ నాయకులు సర్వం సిద్ధం చేశారు. కాగా.. ఆ దిలాబాద్ సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే జోగు రామన్న, ఇచ్చోడ సభా ఏర్పాట్లను మాజీ ఎంపీ నగేశ్, అభ్యర్థి అనిల్ జాదవ్ పరిశీలించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల, బేల, జైనథ్ మం డలాల నుంచి.. బోథ్ నియోజకవర్గంలో జరిగే సభకు బోథ్, ఇచ్చోడ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, నేరడిగొండ, సిరికొండ, తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల నుంచి భా రీ సంఖ్యలో జనం హాజరుకానున్నారు. పోలీసులు భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కేంద్రాలు కటౌట్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలమయం అయ్యాయి.
పదేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు, మూడో సారి కేసీఆర్ ముఖ్య మంత్రి కావడం ఖాయం.
– అనిల్ జాదవ్. బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి
నేడు(గురువారం) ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానంలో నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద యా త్ర’కు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నార ని, ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న కోరారు. బుధవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమ లు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడ్డా యని, వారి ఉపాధి మెరుగుపడిందని పేర్కొ న్నారు. ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ పథకాల లబ్ధిదా రులు ఉన్నారని తెలిపారు. అన్ని మండలాల నుంచి ప్రజలు తండోపతండలుగా తరలిరావా లని కోరారు.