ఎదులాపురం, ఏప్రిల్ 12 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రాణాదివ్యనగర్లో గ్యాస్‌బండ, కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ.. ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని మండి పడ్డారు.
గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మంజుల, కార్యదర్శి.లంక జమున, జిల్లా నాయకులు ఆశన్న, అరఫా బేగం, నగేశ్, విజయ, రానదివేనగర్ కాలనీవాసులు మాయ, సునీత, సంతోషి, పార్వతి, శాలిక్ రావు, పల్లవి, శోభ, తదితరులు పాల్గొన్నారు.