ఆదిలాబాద్ : రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో నిరసన తప్పదని మాజీ మంత్రి జోగు రామన్న ( Jogu Ramanna ) అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
యాసంగిలో రైతులు పండించిన శనగ, జొన్న పంటలు కొనుగోలు చేయాలంటూ బేల మండలం కొబ్బయి వద్ద మాజీ మంత్రి జోగు రామన్న శనివారం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మహారాష్ట్ర- ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి . ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు.