మంచిర్యాలటౌన్, ఆగస్టు 5 : ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకు లు మాట్లాడుతూ అన్ని యాజమాన్యాల్లోని అన్ని క్యాడర్ల బదిలీలు..పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని, జీహెచ్ఎం, ఎస్ఏ, పీఎస్‌హెచ్‌ఎం ఖాళీలను పదోన్నతు ల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో-25ను సవరించాలని, ప్రతిపాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉం డాలని, 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ ఉండాలని, అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని, 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌కు ఆప్షన్ ఇవ్వాలని, పీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధ్దరించాలని కోరారు. సూల్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్కు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి, డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, డైట్, బీఈడీ కళాశాలల అధ్యాపకుల ఖాళీల్లో శాశ్వత నియామకా లు చేపట్టాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈవో పోస్టులు, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో పోస్టులు, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చే యాలని కోరారు. 5571 పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలని, బీఈ డీ, డీఈడీ అర్హతలున్న ఎస్జీటీలందరికీ సీనియార్టీ ప్రకారం పీఎస్‌హెచ్‌ఎం ప్రమోష న్ అవకాశం కల్పించాలన్నారు.
గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు నూతన పోస్టులు మంజూరు చేయాలన్నారు. మో డల్ సూళ్లు, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, మోడల్ సూల్, గురుకుల, ఎయిడెడ్ టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 1.07.2023 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో-317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేరొన్న విధంగా యేటా వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజవేణు, ఎస్సీఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, నాయకులు కుమార్, ప్రకాశ్, కిరణ్ కుమార్, సురేశ్, చిలుక, శిల్ప, సీఆర్పీలు నారాయణ, స్వామి, రాజేశ్, కేజీబీవీ టీచర్లు సూర్యకళ, సునీత పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 5 : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై తక్షణమే స్పందించాలని యూఎస్పీసీ రాష్ట్ర నాయకుడు మేడి చరణ్ దాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఎలను చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను అమలు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైద్య శాంతి కుమారి,శ్యామ్యూల్, ఊశన్న,కేశవ్ , శ్రీనివాస్ , వెంకటేశ్వర్లు, కిరణ్ , శంకర్ . వీజేశ్ , గణేశ్, సృతిక, తుకారాం, పవన్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.