ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనగర్జన సభకు మంగళవారం కాన్వాయ్‌లో వస్తుండగా బాబు జగ్జీవన్ రాం చౌక్ వద్ద ఆదిలాబాద్ సీసీఐ సాధన కమిటీ సభ్యులు నల్ల రిబ్బన్లు, బెలూన్లు పట్టుకొని నిరసన చేశారు.
అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా.. పోలీసులకు, సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీఐని పునరుద్ధరించకపోతే తగిన గుణపాఠం చెబుతామని సభ్యులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు విజ్జగిరి నారాయణ, బండి దత్తాత్రి, బుట్టి శికుమార్, అరుణ్‌కుమార్, సాయి పాల్గొన్నారు.
– ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10