ఎదులాపురం, అక్టోబర్ 19 : ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ సమన్వయంతో పని చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ జిల్లా అధికారులు, మహారాష్ట్రలోని చంద్రాపూర్, యవత్మాల్ జిల్లాకు చెందిన జిల్లా అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెక్‌పోస్టుల వద్ద ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిఘా పెట్టాలన్నారు. చెక్‌పోస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులకు అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో పూర్తి సహకారం అందిస్తామని యావత్మాల్, చంద్రాపూర్ ఎక్సైజ్ అధికారులు నితీశ్ షిండే, పాటిల్ సంజయ్ తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్ సూపరింటెండెంట్ వై.హిమశ్రీ, బీ జ్యోతికిరణ్, కేజీ. నందగోపాల్, ఎస్‌హెచ్‌వోలు సీహెచ్ .శ్రీనివాస్, టీ మ హేందర్ సింగ్, ఏసీ. ఏ.రాకేష్‌కుమార్, సిబ్బంది ఎస్.సమైయా శ్, లక్ష్మణ్‌రావు, మంగమ్మ, మోసిన్ అలీ ఉన్నారు.