కోటపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆందోళన చేసిన కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులపై (BRS Leaders ) పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులకు రూ. 2లక్షల సంపూర్ణ రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు గత అక్టోబర్ 20న ఆందోళన చేయగా వారిపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ నాయకులు సింగిల్ విండో చైర్మన్ సాంబ గౌడ్, నాయకులు కల్వకుంట్ల తిరుపతి రావు, కొట్టె నారాయణ, కంకణాల సంపత్ రెడ్డి, ఆసంపెల్లి సంపత్ కుమార్ చెన్నూరు కోర్టు ( Chennur Court ) లో హాజరు పరిచారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమంగా కేసుల నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతను అరెస్టులతో అణిచి వేయలేరని వారు పేర్కొన్నారు.