నిర్మల్ టౌన్, జూన్ 26: నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కోరారు. మాదక ద్రవ్యాలను వినియోగించడం వల్ల సమాజంలో శాంతికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా అధికారులు ధన్రాజ్, వేణుగోపాలకృష్ణ, సు ధీర్కుమార్, లోకేశ్, అశ్వక్ అహ్మద్, అంజి ప్రసాద్, హన్మండ్లు, సాయిబాబా, రాజేశ్వర్గౌడ్, శంకర్, నర్సింహారెడ్డి, క్రాంతికుమార్, తనూజ, అంబూజీనాయక్, శంకరయ్య, నాగేశ్వర్రావు, శ్రీకళ, అశోక్ కుమార్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
రికార్డులను వెంటనే అందించాలి..
నియోజకవర్గాల అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల రికార్డులను వెంటనే సీపీవో కార్యాలయంలో అందించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఫండ్ వినియోగంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సీపీవో మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
పారదర్శకంగా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
పారదర్శకంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో సమగ్ర ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు.ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని ముథోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో సమగ్ర ఓటరు జాబితాను ప్రకటించడం జరిగిందని, ఇందులో తప్పొప్పులను సరిచేసి పూర్తి వివరాలను అందించాలన్నారు. ఈవీఎం ప్యాడ్ల తనిఖీని పరిశీలించి జాగ్రత్తలపై సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, రాజకీయ పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణిలో కలెక్టర్
కొత్త కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. పలువురు తమ అర్జీలను సమర్పించి, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సంబంధిత అధికారులకు వాటిని అందజేసి, పరిష్కరించాలని ఆదేశించారు. నిర్మల్లో పీజీ కళాశాలను వెంటనే పునఃప్రారంభించి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరవింద్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.
ఉట్నూర్, జూన్19: గిరిజనులకు ఐటీడీఏ ఇస్తున్న పథకాలు స ద్వినియోగం చేసుకోవాలని ఏపీవో జనరల్ భీంరావు, డీడీ దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం గిరిజన దర్బార్లో పాల్గొ ని గిరిజనులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆశ్రమాల్లో ప్రవేశాలు కల్పించాలని, స్వయం ఉపాధి పథకాలు మం జూరు చేయాలని, వ్యవసాయ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించారు. ఏజెన్సీ అదనపు వైద్యాధికారి బాలు, ఏపీవో పీటీజీ ఆత్రం భాస్కర్, ఓఎస్డీ కృష్ణయ్య, జేడీఎం నాగభూషణం, ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, డీపీవో ప్రవీణ్, మేనేజర్ లింగు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
అర్జీలపై సత్వరం స్పందించాలి
ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
ఎదులాపురం,జూన్ 26: ప్రజావాణిలో అర్జీలను పరిశీలించి, సత్వరమే స్పందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. భూ సంబంధ సమస్యలు, విద్య, పింఛన్, ఉపాధి కల్పన, పౌర సరఫరాలు, రెవెన్యూ , రెండుపడక గదుల ఇండ్లు, తదితర సమస్యలపై అర్జీలను కలెక్టర్ స్వీకరించి వాటి పరిష్కారానికి ఆయా శాఖాధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు. శాఖ ల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై అధికారులతో స మీక్షించారు. శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రా థోడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
ఓటరుగా నమోదు చేయాలి
ఎదులాపురం,జూన్ 26: అర్హత కలిగిన వారిని ఓటరుగా న మోదు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు జాబితాపై సోమవారం తహ సీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాను పారదర్శకంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన వారందరూ ఒకే పో లింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలన్నారు. దివ్యాంగుల కోసం ర్యాంపు, అవసరమైన ఇతర ఏర్పాట్లు చేయాలని సూ చించారు. సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలిన జరిపి, సమగ్ర ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్లు తదితరులున్నారు.