నార్నూర్ : వర్షాకాలంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ( Chronic diseases ) ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని హెల్త్ సూపర్ వైజర్ చౌహాన్ చరణ్ దాస్ (Chauhan Charan Das) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం నాగల్ కొండ సబ్ సెంటర్ పరిధిలోని బలాన్ పూర్ గ్రామంలో శుక్రవారం డ్రై డే నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వైద్య శిబిరం ఏర్పాటుచేసి రక్త పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. వర్షాలు కురుస్తుండడంతో పరిసరాల శుభ్రతను పాటించాలని, లేనిపక్షంలో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రియాంక, దినేష్, జవహార్ లాల్, కైలాస్, గోకుల్, మాజీ సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, ఆశా కార్యకర్తలు సరిత, బోజ్జు బాయి తదితరులున్నారు.