Pre-arrest | నెన్నెల. జూన్ 27:తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన చలో హైద్రాబాద్ కమిషనరెట్ కార్యక్రమానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న గ్రామపంచాయతీ మల్టీ వర్కర్ల ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్మికులను ఎక్కడికక్కడ పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు.
కొందరిని తెల్లవారు జామున ఇండ్ల మీదికి వెళ్లి కార్మికులను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొన్ని నెలలుగా డిమాండ్ల కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నామని కార్మికులు వాపోయారు. పూటకూడా గడవని స్థితి ఉందని, రెగ్యులర్ గా వేత నాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న వారిని జేపీవో గా ఉద్యోగం కల్పించాలని కోరేందుకే కమిషనరెట్ కు బయలు దేరాటానికి సిద్ధంగా ఉంటే పోలీసులు అరెస్టు చేవారని పలువురు కార్మికులు తెలిపారు.