మంచిర్యాల, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా జన్నారం మం డలం తపాలాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ‘ఈ జాబితాలో ఉన్నోళ్లందరూ ఇల్లు ఉన్నవారే.. ఇల్లు లేనోళ్లు ఎవరూ లేరు. అసలు ఈ జాబితా మీకు ఎక్కడి నుంచి వ చ్చింది. ఎవరి నుంచి తీసుకున్నారు. ఇల్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇందిరమ్మ ఇల్లు వస్తే మరి లేనోళ్లం ఏం కావాలి ? అంటూ జన్నారం ఆర్ఐ గంగారాజాను గ్రామస్తులు ప్రశ్నించా రు. ఇందుకు ఆర్ఐ స్పందించి మాట్లాడు తూ.. ‘ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపి క ప్రక్రియ ఇప్పుడే మొదలైంది.
జాబితాలో పేర్లు వచ్చినోళ్లందరికి వచ్చినట్లు కాదు. పేర్లు లేనోళ్లకు రానట్లు కాదు. ఇది కేవలం మొన్న చేసిన సమగ్ర సర్వే ప్రకారం వచ్చిన డేటా.. ఎవరిదైనా మిస్ అయితే అయింది కావచ్చు.. ఎన్నో వందల పేర్లలో ఒక పేరు మిస్ అవుత ది.. దీంతో అంతా అయిపోయినట్లు కాదు. మీరు అప్లికేషన్ ఇవ్వండి నేను తీసుకుంటా ను.’ అని తెలిపారు. ఎన్ని సార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ ఆర్ ఐపై గ్రామస్తులు మరోసా రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సమక్షం లో అర్హులను ఎంపిక చేస్తామని ఆర్ఐ చెప్ప డం, పోలీసులు సైతం సర్ది చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. సభ అనంతరం ఈ సభ లు, జాబితాలు అన్ని ఉత్తవే… పంచాయతీ ఎన్నికల కోసం వేస్తున్న ప్రయత్నాలంటూ జనాలు మాట్లాడుకోవడం కనిపించింది.