కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipeta ) మండలంలోని రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ ( Panchayat Polling ) ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తయ్యింది. పలు చోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభం ఇచ్చి వెంటనే ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాల అనంరతం ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. కాసిపేట మండలంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. డీసీపీ భాస్కర్, డీపీవో వెంకటేశ్వర్ రావు, తదితర ఉన్నతాధికారులు పోలింగ్‌ను పర్యవేక్షించారు.
మండలంలో 22 సర్పంచ్ స్థానాలకు ఒక సర్పంచ్ స్థానం ధర్మారావుపేట సర్పంచ్ ఏకగ్రీవం కాగా 21 సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలు జరగగా పోలింగ్ ముగిసింది. 21 సర్పంచ్ స్థానాలకు కు 64 మంది బరిలో ఉన్నారు. 190 వార్డులు ఉండగా 48 మంది ఏకగ్రీవం కాగా 9 వార్డుల్లో నామినేషన్లు పడలేదు. దీంతో 133 వార్డులకు 349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం వరకు ఫలితాలు తేలనున్నాయి.