ఎదులాపురం, జూన్ 5 : మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదురోవాలంటే మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడమే మార్గమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేరొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురసరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడాలో హై డెన్సిటీ మిక్స్డ్ ప్లాంటేషన్ విధానంలో పెద్ద సంఖ్యలో మొకలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ మొకలు నాటి నీరు పోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-ప్రగతికి ప్రణాళిక అనే నినాదంతో ఉద్యమంలా మొకలు నాటాలని సూచించారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం పెరిగితేనే భావితరాలకు స్వచ్ఛమైన, కాలుష్యరహిత వాతావరణాన్ని అందించగలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనుష సతీశ్, మారెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ నిరోష, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎఫ్‌డీవో అరవింద్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పర్యావరణ దినోత్సవంలో ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, మారెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన సూచనలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి ఒకరూ తమ ఇంటి పరిసరాలు, దుకాణాల ఎదుట, ఖాళీ ప్రదేశాల్లో మొకలు నాటి వాటిని సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. అనంతరం డీఎఫ్‌వో బాజీరావ్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ అడవులతో పాటు వన్యప్రాణాల రక్షణ కోసం గ్రామ ప్రజలతో పాటు యువకులు ముందుకు రావాలన్నారు. తమకు సహకరించిన వారికి అటవీ శాఖ తరఫున ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, డీఆర్డీవో రవీందర్‌రాథోడ్, డీవైఎస్వో జకుల శ్రీనివాస్, పశు సంవర్ధక శాఖ అధికారి రామారావ్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులున్నారు.