ఉట్నూర్, మే 18 : వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మం ద మకరంద్ అన్నారు. సోమవారం పీవో క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి మండలంలోని పాఠగూడ గ్రామానికి చెందిన గేడం రాములు తనకు బోర్వెల్ మంజూరు చేయాలని, మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన సౌంద ర్య ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం కల్పించాలని, ఉట్నూర్ మండలంలోని చిక్రంగూడ గ్రామానికి చెందిన సోయం రాధాబాయి గొర్రెల లోన్ మంజూరు చేయాలని, వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన భీంరావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయాలని, ఆదిలాబాద్ మండలంలోని పీహెచ్సీ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఇల్లు మంజూరు చేయాలని, సాత్నాల మండలంలోని మెడిగూడ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అర్జీలు పెట్టుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులకు తమకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అర్జీలు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిద శాఖల అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు.