ఆసిఫాబాద్ టౌన్, మార్చి 21 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడేనని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. శనివా రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. వారు మా ట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెలకు మాత్ర మే పరిమితమైందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సరిపడా బడ్జెట్ కనబడ డం లేదని మండిపడ్డారు. యువతకు మరోసారి మొండిచేయి చూపడంతో ఇది ప్రజా ప్ర భుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దినకర్,కార్తీక్, టికానంద్, రాజ్‌కుమార్, రాజు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో..
నస్పూర్, మార్చి 21 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సరైన బడ్జెట్ కేటాయింపు చేయలేదని నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాష్ట్ర బడ్జెట్ ప్రతులను ద హనం చేసి, నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ రా ష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రసంగంలో భారీ హామీ లు, గొప్ప పదజాలం వినిపించినా, క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. వి ద్యారంగానికి కేవలం 8.22 శాతం నిధులు కేటాయించడం సరైంది కాదన్నారు. కనీసం 10 శాతం కూడా కేటాయించకుండా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. యూనివర్శిటీలకు తగినన్ని నిధులు కేటాయించలేదన్నా రు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో ఖాళీలను భర్తీ చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోవడం దారుణమన్నారు. వెంటనే విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకు లు శ్రీకాంత్, అభినవ్, నిఖిల్, అరవింద్‌రెడ్డి, విష్ణు ప్రసాద్, సాయికుమార్ పాల్గొన్నారు.
