ఆదిలాబాద్ : వంట గ్యాస్ కొరత ప్రచారం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు సిలిండర్లు తీసుకపోవడానికి, బుకింగ్ చేసుకోవడానికి వినియోగదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జనం ఒకేసారి రావడంతో క్యూ లైన్ లో సిలిండర్ల పంపిణీ చేపట్టారు. బుకింగ్ చేసుకున్న వారికి సిలిండర్లు పంపిణీ చేయడంతో పాటు అవసరం ఉన్నవారికి బుక్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రంలో గృహ, కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో గ్యాస్ బ్లాక్ దందా కొనసాగుతున్నది. గ్యాస్ సిలిండర్ల కోసం హోటల్ యజమానులు, హాస్టల్, మెస్ నిర్వాహకులు ఏజెన్సీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకేరోజు సిలిండర్ కావాలంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.