జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని హస్తినమడుగుకు ఆదివారం ఉదయం 200 మందికి పైగా మెస్రం వంశీయులు చేరుకున్నారు. మొదట పుణ్యస్నానం ఆచరించి అక్కడే పిండివంటలు చేసి పితృదేవతలకు నైవేద్యంగా పెట్టారు. అనంతరం నాగోబాకు అభిషేకం చేసేందుకు వారి వెంట తెచ్చుకున్న ఝరిలో గంగాజలాన్ని సేకరించారు.
సహపంక్తి భోజనం చేసి తిరుగు పయనమయ్యారు. ఫిబ్రవరి 9వ తేదీకల్లా నాగోబాకు చేరుకొని పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి జాతరను ప్రారంభిస్తామని మెస్రం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయ ప్రధాన్ దాదారావ్, కఠోడ, మెస్రం కోసురావు,కొత్వల్ హన్మంతరావు,మెస్రం కోసు, తిరుపతి పాల్గొన్నారు.
– జన్నారం, జనవరి 28