హస్తలమడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు దోడందకు చేరుకున్నారు. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ పొలిమేరలో మంగళవారం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దోడందకు బయలు దేరారు.
జన్నారం మండలం కలమగుగు వద్ద గోదావరి నదిలోని హస్తల మడుగులో ఈ నెల 10న ప్రత్యేక పూజలు నిర్వహించి ఝరిలో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు మండలంలోని దోడందకు చేరుకున్నారు.