ఇంద్రవెల్లి, జనవరి12 : జన్నారం మండలం కలమగుగు వద్ద గోదావరి నదిలోని హస్తల మడుగులో ఈ నెల 10న ప్రత్యేక పూజలు నిర్వహించి ఝరిలో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు మండలంలోని దోడందకు చేరుకున్నారు. ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామపోలిమేరలో గురువారం రాత్రి కొద్దిసేపు నిలకడ చేసి అనంతరం అక్కడి నుంచి గంగా జలంతో దోడందకు బయల్దేరారు. నర్సాపూర్ గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు గంగా జలం ఝరికి ప్రత్యేక పూజలు చేశారు. దోడంద గ్రామానికి గంగాజలంతో రాత్రి చేరిన మెస్రం వంశీయులకు గ్రామస్తులు సాంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ పోలిమేర లోని ఓ చెట్టుపై అల్లుడిచేత గంగాజలం ఝరిని భద్రపర్చారు. ఝరికి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. మెస్రం వంశీయులు గంగాజలంతో 12నుంచి16వరకు దోడంద గ్రామంలో (విశ్రాంతి)ఉంటున్నట్లు కటోడ మెస్రం కోసు, ప్రర్ధాంజీ మెస్రం దాదారావ్, కటోడ కోసేరావ్ తెలిపారు. మెస్రం వంశీయులు గణపతి, తిరుపతి, ధర్ము, చిత్రు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్,జనవరి12 : కేస్లాపూర్ నాగోబ ఆల యానికి పూజలు నిర్వహించేందుకు పవిత్ర గంగాజలాన్ని తీసుకెళ్తున్న మెస్రం వంశీయులు గురువారం మండల కేంద్రంలోని ఏత్మాసూర్లో బస చేశారు. గంగాజలానికి జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 21న కేస్లాపూర్లో నాగోబాకు ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు.
నాగోబా జాతరను పురస్కరించుకొని చేపడు తున్న పనులను నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం గురువారం పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో కలిసి గురు వారం సాయంత్రం ఆయన పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులతోపాటు మర్రిచెట్ల నీడలో మూడురోజులు ఉండే మెస్రం వంశీయులకు తాగునీటితోపాటు ఇతర సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మ ద్ అబ్దుల్ అమ్జద్, ఆలయ ఈవో రాజమౌళి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నారు. నాగోబా ఆలయ ఆవరణలో చేపడుతున్న ఏర్పా ట్లను ఐటీడీఏ ఏపీవో జనరల్ భీంరావ్ పరిశీ లించారు. కెస్లాపూర్ మాజీ సర్పంచ్ మెస్రం నాగ్ నాథ్, జీపీ కార్యదర్శి మహ్మద్ మోతేశాం, నాగోబా ఆలయ ఈవో రాజమౌళి ఉన్నారు.