ఉట్నూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ( Government Hospital ) ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel ) ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిలపై ఆరా తీశారు. అనంతరం బీపీ చెకప్ చేసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. రోగులకు అన్ని రకాల సౌకర్యాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు.ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.