ఉట్నూర్ రూరల్, జనవరి 2 : గ్రామాల్లో బూత్ కమిటీల ఏర్పాటుతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాల మేరకు సోమవారం కన్నాపూర్ గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించి బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులకు నిర్వహించాల్సిన బాధ్యతల గురించి వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెందూర్ జుగాదిరావ్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు రషీద్, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు తన్నీరు సతీశ్, మనోహర్, నైతం జంగు, చిత్రు, నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.