ఎదులాపురం, మే 3 : ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు న మోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండడానికి, మొట్ట మొదటిసారిగా మైనర్ డ్రైవింగ్ చేసిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒకవేళ మైనర్ తెలియక ప్రమాదాలకు కారణమైతే ఇన్సూరెన్స్ రాకుండా పోతుందనే విషయాన్ని తెలియజేశారు.
మధ్య తరగతి కుటుంబ సభ్యులు 18 ఏండ్లు పైబడిన పిల్లలకు డ్రైవింగ్ లైసె న్సు తీసుకోవాలని తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 295 మంది మైనర్లు వాహనాలతో పట్టుబడ్డార ని, 295 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం వారి తల్లిదండ్రులకు వాహనాలు ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రిపూట రోడ్లపై అనవసరంగా తిరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు కరుణాకర్, ప్రణయ్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, శ్రీపాల్ పాల్గొన్నారు.
విధులను క్రమశిక్షణతో నిర్వహించాలి
సిబ్బంది విధులు నిర్వర్తించే క్రమంలో క్రమశిక్షణతో ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సిబ్బంది ప్రతి ఒకరికి పరేడ్ నిర్వహిస్తామని, పరేడ్ వల్ల సిబ్బంది ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధా లు మెరుగుపడతాయన్నారు. అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలని సూచించారు. పరేడ్‌లో మొదటగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి మురళి ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించి ఏడు ప్లాటూన్లతో కూడిన పరేడ్‌లతో విడతలవారీగా ప్రత్యేక గౌరవ వందన సమర్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పరేడ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, సిబ్బంది విధులలో చెడు వ్యసనాలను గురికాకుండా ఉండాలని సూచించారు. 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా పరేడ్‌కు బదులు యోగ శిక్షణను అందిస్తామన్నారు. పరేడ్‌లో భాగంగా సిబ్బందికి ఆయుధాలు, వాటి వినియోగం, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్‌పై శిక్షణ అందించారు. అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్, ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.