కుభీర్ : గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ( Polling ) ప్రశాంతంగా జరిగిందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ (Collector Abhilasha) తెలిపారు. బుధువారం జరిగిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ కుభీర్ మండలంలోని మలేగాం పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అక్కడ పోలింగ్ ప్రక్రియను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల రిపోర్టింగ్ సకాలంలో అందించాలని, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, ఎన్నికలో ప్రతి అంశం పారదర్శకంగా జరగాలని సూచించారు.ఆమె వెంట జడ్పీ సీఈవో నరేందర్, పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, తహసీల్దార్లు శ్రీనివాస్, సునీత, ఎంపీడీవోలు ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.