సారంగాపూర్; డిసెంబర్ 23 :హెచ్ఆర్సీ పాలసీ పెంచినందుకు మండలంలోని కౌట్ల(బీ) సహకార సంఘం ఉద్యోగులు శుక్ర వారం సీఎం కేసీఆర్‌చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలూరు, కౌట్ల(బీ) పీఏసీఎస్ చైర్మన్లు మాణిక్‌రెడ్డి, అయిరా నారాయణ రెడ్డి మాట్లాడారు. జీవో నంబర్ 44 ప్రకారం ఉద్యోగస్తులకు హెచ్ఆర్సీ పాలసీ పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
సహకార సంఘం ఉద్యోగులు ఎల్లవేళలా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు ముందుకెళ్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఆలూరు పీఏసీఎస్ సీఈవో మల్లేశ్, కౌట్ల(బి) పీఏసీఎస్ సీఈవో సలీమ్, జిబ్బంది, తదితరులు ఉన్నారు.