రెబ్బెన : జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ( Paddy procurement ) ప్రక్రియను వేగవంతం చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ( Collector Venkatesh Dotre) అన్నారు. రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామంలో ఐకేపీ( IKP ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమశాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తరావు, అదనపు అధికారి రామకృష్ణ , తహసీల్దార్ సూర్యప్రకాష్ రావు , ఏపీఎం వెంకటరమణ శర్మ ఉన్నారు.