తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచ్చలాపూర్(Achalapur ) భారతి తీర్ధ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉచిత న్యూరాలజీ వైద్య శిబిరానికి ( Free Medical Camp ) అనూహ్య స్పందన వచ్చింది. గ్రామానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ అభినయకుమార్ గట్టు ( Dr. Abhinaya Kumar Gattu ) నేతృత్వంలో వైద్యులు ముద్దు రాఘవ కృష్ణ , సృష్టి వైద్య శిబిరంలో పాల్గొని వివిధ రకాల కార్పోరేట్ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
తాండూర్, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు వివిధ సమస్యలతో శిఖరానికి వచ్చి పరీక్షలను చేసుకున్నారు. సుమారు 250 మందిని పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అవసరం ఉన్న వారికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు రెఫర్ చేశారు. హైదరాబాద్, అహ్మదాబాద్ పట్టణాలలో వైద్య వృత్తి నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతులు ఘటించిన ఈ ముగ్గురు వైద్యులు కూడా అచ్చలాపూర్ వాస్తవ్యులే కావడం గమనార్హం.
అచ్చలాపుర్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గట్టు విశ్వనాధ్ శర్మ దంపతుల సహకారంతో నిర్వహించిన శిబిరాన్ని స్థానిక మహావేద పాఠశాల ప్రధాన అధ్యాపకుడు దుద్దిల్ల మనోహర్ శర్మ జ్యోతిప్రజ్వాలనచేసి ప్రారంభించగా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులతో పాటు స్థానిక సర్పంచ్ మారిశెట్టి స్రవంతి, ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్ వైద్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువకులు, స్థానిక బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.