తాండూర్ : సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు నామినేషన్ ( Nomination ) , పోలింగ్ కేంద్రాలను ( Polling Stations ) సీఐ దేవయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
15 గ్రామపంచాయతీ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్, పోలింగ్ కేంద్రాలు అక్కడ ఉన్న సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళి సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్ ఫలితాలు ముగిసేంతవరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఓటర్లు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.