శ్రీరాంపూర్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ సభపై శ్రీరాంపూర్‌లో 5, 6, 17 వార్డులు ఆర్కే 6 గుడిసెలు, శ్రీరాంపూర్ కాలనీలో బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జిలు మల్లెత్తుల రాజేంద్రపాణి, ఎండీ రఫీఖ్కాన్, మాజీ ఎంపీటీసీ లాట్కూరి రాయలింగు, గుమ్మడి శ్రీనివాస్‌లు పోస్టర్లతో ప్రచారం చేశారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపతి తిరుపతి, సందినేని శ్రావణ్ పాల్గోన్నారు.
చెన్నూర్, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ప్రధాన రహదారుల గుండా పార్టీ జెండాలు, తోరణాలతో చెన్నూర్ పట్టణ మంతా గులాబీ మయమైంది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గోడలపై వాల్ రైటింగ్ రాయించారు. పోస్టర్లను అంటించి, వాడల్లో సభ గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రజతోత్సవ సభకు తరలిరండి రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి రావాలని కోరారు.
మందమర్రిరూరల్, ఏప్రిల్ 26 : రజతోత్సవ సభపై మందమర్రి పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు , చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.మాజీ జడ్పీటీసీ వేల్పుల రవి, గుర్రం శ్రీనివాస్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్, ఏప్రిల్ 26 : మందమర్రి మండలం నుంచి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండల ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని ఆదిల్‌పేట గ్రామంలో శనివారం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పబ్లిసిటీ ఇన్చార్జి తైదల జంపన్న, నాయకులు గుర్రం శ్రీనివాస్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, రాజయ్య, మొగిలి, రవీందర్, భీంరావు, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.