కుభీర్, అక్టోబర్ 07 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి చెందిన ముచ్చిండ్ల గణేష్ (23) అనే యువకుడు తాగుడికి బానిసై జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఏ కృష్ణారెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా గణేష్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన ఇరుగుపొరుగు వారు కుటుంబీకులకు సమాచారం అందించి హుటాహుటిన ఆయనను భైంసా ఏరియా దవాఖానకు తరలించారు.
వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించగా అక్కడి దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.