దస్తూరాబాద్ : నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మున్యాల్ కొత్తపెద్దూర్ గ్రామానికి చెందిన పటేల్ స్నేహలత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త శ్రీనివాస్ కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, సోమవారం ఉదయం కూడా గొడవపడి కొట్టడంతో పాటు దూషించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తీవ్ర మనస్తాపానికి గురైన స్నేహలత మధ్యాహ్నం కడెం లెఫ్ట్ కెనాల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు భర్త శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.