క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఇందుకోసం నియోజకవర్గానికి స్టేడియం నిర్మిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మహ్మద్ నసీమొద్దీన్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ-20క్రికెట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కాసేపు మంత్రి, కలెక్టర్ముషారఫ్ అలీ ఫారూఖీ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ క్రీడాకారుల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతకు రూ.50,000, రన్నరప్‌కు రూ.25,000 నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకులు మహ్మద్ రయిసొద్దీన్, వసీ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, చాహుస్, కలీమ్హైమద్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.