కుభీర్ : అక్టోబర్ 15 : తమ పిల్లలను కళాశాలలో నిర్వహించే తరగతులకు గైర్హాజరు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఎంతైనా ఉందని అధ్యాపకులు సూచించారు. నిర్మల్ జిల్లా మండల కేంద్రం కుబీర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు బుధవారం తరచూ తరగతులకు గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు. హాజరు శాతం పెంపునకు తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు తల్లిదండ్రులకు వివరించారు.
విద్యార్థుల భవిష్యత్తులో ఇంటర్మీడియట్ అనేది కీలక మలుపుగా భావించాలని తరగతులకు గైర్హాజరవుతూ ఉంటే పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే చదువులపై పిల్లలకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని సూచించారు. ఇతర వ్యాపకాలకు వెళ్లకుండా కళాశాలకు తప్పకుండా హాజరయ్యేలా దృష్టి సారించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు సంపత్, హన్మంతరావు, నర్సయ్య, శివరాజ్, శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.