బాసర, మే 28 : బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ను బుధవారం వైస్ చాన్సలర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ.. బాసర సెంటర్లో 1500ల సీట్లు, మహబూబ్నగర్ సెంటర్లో 180 సీట్లకు ఆరేండ్ల సమీకృత విద్యావిధానంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేశామన్నారు.
ఈ విశ్వవిద్యాలయం సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పటయిందని, ఇంజినీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. దీంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు పేద విద్యార్థులు పొంతున్నారని అన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ట్రిపుల్ ఐటీ వెబ్సైట్లో ఉంచామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో-కన్వీనర్ డాక్టర్ దేవరాజ్, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, మంతపురి హరికృష్ణ పాల్గొన్నారు.