నిర్మల్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ పదవుల భర్తీలో సామాజిక వర్గాలవారీగా ప్రాధాన్యత లభించింది. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన చిలుక రమణ నియమితులయ్యారు. రమణ ఏడేండ్లుగా పద్మశాలి సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే మంత్రి అనుచరుడిగా, టీఆర్ఎస్ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయనతోపాటు యాదవ కులానికి చెందిన శ్రీకాంత్ యాదవ్‌కు వైస్ చైర్మన్ పదవి లభించింది. ఇక 16 మంది డైరెక్టర్ల పదవుల్లోనూ అన్ని కులాలకు ప్రాధాన్యం కల్పించారు. కొత్త పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. అలాగే సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి వంజర్ శ్రీనివాస్‌రెడ్డి కూతురు చించోలి అశ్రితను ఎంపిక చేశారు. వైస్ చైర్మన్‌గా ఎస్టీ వర్గానికి చెందిన దత్తురాంను నియమించారు. వీరితోపాటు మరో 16 మందిని డైరెక్టర్లను నియమించారు. శ్రీనివాస్‌రెడ్డి 2017నుంచి 2019వరకు అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌గా పనచేశారు. ఇరవై ఏండ్లుగా మంత్రికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. కొత్త పాలకవర్గం సెప్టెంబర్ 1న కొలువుదీరనుంది. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతోపాటు డైరెక్టర్ల నియామకంలోనూ మంత్రి సామాజిక న్యాయం పాటించారు. అన్ని కులాలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో కూర్పు చేశారు.
కొలువుదీరనున్న పాలకవర్గం…
నిర్మల్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ఆదివారం కొలువుదీరనుంది. చైర్మన్‌గా చిలుక రమణ, వైస్ చైర్మన్‌గా శ్రీకాంత్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితోపాటు డైరెక్టర్లుగా అల్లకొండ రమేశ్, గుర్రాల లింగారెడ్డి, రాథోడ్ అశోక్, నల్ల లింగారెడ్డి, జక్క పెద్ద రాజేశ్వర్, అయిటి గంగారాం, మహమ్మద్ సలీం, లెంక బుచ్చన్న, నూకల చిన్నయ్య, నాలం గంగాధర్, పడిగెల శ్రీచరణ్, గొల్లపెల్లి నర్సాగౌడ్లతోపాటు ఎఫ్ఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మున్సిపల్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ముందుగా చైర్మన్, వైస్ చైర్మన్ల అనుచరులతోపాటు, పద్మశాలి కులస్తులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసం నుంచి మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.