నిర్మల్ టౌన్, మే 31 : నిర్మల్ జిల్లాలోని రైతుల ఖాతాల్లోకి వరిధాన్యం డబ్బు ఇప్పటి వరకు రూ.30 కోట్లు జమ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుధారాణి తెలిపారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో సుమారు 40లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 182 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. డీసీఎంఎస్, సహకార, ఐకేపీ ద్వారా కొనుగోళ్లను చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటివరకు 8,76,674 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించామని వెల్లడించారు. అందుకు సంబంధించి 19,411 మంది రైతుల ఖాతాల్లో రూ.30 కోట్లు జమచేసినట్లు చెప్పా రు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశాల మేరకు జిల్లాలో మే 31లోగా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆదేశించడంతో ఇప్పటివరకు 22 కేం ద్రాల్లో పూర్తి చేసి రైస్‌మిల్లులకు తరలించామని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో డీఎం సివి ల్ సప్లయ్ అధికారి శ్రీక ళ, సిబ్బంది ఉన్నారు.