లక్ష్మణచాంద, జనవరి 6 : నిత్యం అన్నదాత సంక్షేమం కోరే సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధుసమితి, వ్యవసాయశాఖ ల ఆద్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబు రాల్లో మంత్రి పాల్గొన్నారు. ముందుగా ఆయన జడ్పీచైర్‌పర్సన్ కొరపెల్లి విజయలక్ష్మి, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భం గా విద్యార్థులు, మహిళలు వేసిన ముగ్గులను మం త్రి ఆసక్తిగా తిలకించారు. సుందరంగా ముగ్గులు వేసిన విద్యార్థినులకు మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో రైతు బం ధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు. రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ సర్కారును విమర్శించే స్థా యి లేదన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడు తూ రైతు బంధు పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీ సీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, ఏడీఏ వినయ్‌బాబు, ఏవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ కవితారెడ్డి, ఎంపీడీ వో శేఖర్, నాయకులు అడ్వాల రమేశ్, గుజ్జారి గణేశ్, కోండ్ర నరేశ్ రెడ్డి, బిట్లింగ్ నారాయణ, ఈటెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధుతో వెలుగులు : మంత్రి
ఏటా రెండు దఫాలుగా పెట్టుబడి సాయం అందిస్తూ సీఎం కేసీఆర్ అన్న దాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన సంబురాలకు ఎమ్మెల్సీ దండె విఠల్ తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజర య్యా రు. పెద్ద సంఖ్యలో రైతులు, టీఆర్ఎస్ నాయ కులు తరలివచ్చారు. గిరిజనులు గుస్సాడీ, బంజా రా నృత్యంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. బంజారా మహిళలతో కలిసి మంత్రి నృత్యం చేశారు. ముందుగా రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడారు. జూనియర్ కళాశాల విద్యార్థులు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించా రు. మొదటి బహుమతి అలుగుల రుతిక టీం, ద్వితీయ బహుమతి కట్లకుంట రమ్య టీం, తృతీ య బహుమతి మట్టేరి మల్లేశ్వరి టీమ్‌కు అందజే శారు. జడ్పీ అధ్యక్షురాలు విజయ లక్ష్మీ రాంకిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రఘనందన్‌రెడ్డి, రైతు బం ధు సమితి జిల్లా కన్వీనర్ నల్ల వెంకట్రాంరెడ్డి, మామడ సర్పంచ్ హన్మగౌడ్, ఎంపీపీ రాథోడ్ అమృత, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మద, జిల్లా వ్యవసాయ అధి కారి అంజిప్రసాద్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీ డీవో మల్లేశం, ఏవో నాగరాజు, నాయ కులు భాస్కర్‌రావు, నవీన్‌రావు, రాందాస్, నల్ల లింగా రెడ్డి, అలీం, పాష, అశోక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఓల, సూర్యాపూర్ గ్రామాల్లో..
వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్రంలో లాభసా టిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని భైంసా ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఓల, సూర్యాపూర్ గ్రామాల్లో జరిగిన రైతుబంధు సంబురాల్లో ఆయన మాట్లాడారు. స్థానిక రైతు వేదికల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశా రు. ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు బిల్లోల శంకర్ గౌడ్, సర్పంచ్‌లు ఖనీష్ ఫాతిమా, బాపురావు, బక్కి సునీత, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేశ్, ఏఏంసీ సొసైటీ డైరెక్టర్లు సబ్బిడి గజేందర్, నారా యణ పటేల్, ఏవో సోమ లింగారెడ్డి, ఏఈ వోలు ప్రగతి, శ్రీధర్, నాయకులు ఎగ్గాం గణే శ్, హైమ ద్ పాషా, గందె శివ కుమార్, రాజేందర్, ప్రవీణ్, సదాశివ పటేల్, శరత్ గౌడ్, భోజన్న, మల్లేశ్, సాయి, రాజు, గోపాల్, శివాజీ పాల్గొన్నారు.
తరోడాలో..
ముథోల్, జనవరి 6 : మండలంలోని తరోడా రైతువేదికలో నాయకులు, రైతులు ఘనంగా రైతు బంధు సంబురాలు జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, రాంరెడ్డి, నాయకులు సూర్యంరెడ్డి, మగ్దూ మ్తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
దిలావర్పూర్లో..
దిలావర్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో గురువారం టీఆర్ఎస్ నాయకులు రైతు బంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని గ్రామస్తులు, రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల మధ్య కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ మొహిద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల గజేందర్, ఆకుల వెంకాగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగాదర్, కొక్కుల ప్రదీప్, పీఏసీఎస్ చైర్మన్లు అమంద శ్రీని వాస్, సత్యనాయణ రెడ్డ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజగంగన్న, కార్యదర్శి తూము చర ణ్, నాయకులు వొలుగుల వెంకటేశ్, కరిపె శ్రీని వాస్, నారాయణ, దాసరిగొండ మల్లయ్య, టేకు మధు, పత్రి శ్రీనివాస్, విజయానంద్, రాజమ ల్లయ్య, అల్లి మల్లేశ్, కాశవేణి రాజన్న, పత్రి నగేశ్, తుదిగేని రాజలింగం, మురళి, రాజన్న, పత్రి నగేశ్, తదితరులు పాల్గొన్నారు.