Kubeer | కుభీర్, నవంబర్ 18 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో దినదినాభివృద్ధి చెందుతూ మరో పండరీపుర క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన అఖండ హరినామ సప్తాహ వేడుకలు మంగళవారం అన్నదానంతో ముగిశాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో విట్టల రుక్మిణి విగ్రహాలకు అభిషేకం, పుష్పార్చన, పట్టువస్త్రాల సమర్పణ అనంతరం కాకడ హారతి కన్నుల పండుగ సాగింది. విట్టల, రుక్మిణి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో పురవీధుల గుండా భజనలు, మేళ తాళాలతో స్వామి వారిని ఊరేగించారు.
అనంతరం ఆలయంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ పరమేశ్వర మహారాజ్ చే ‘కాలా కీర్తన’ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. పరమేశ్వర్ మహారాజ్య తులసి మాలధారణ జరిగింది. పలువురు భక్తులు తులసి మాలధారణ వేసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సహ పంక్తి భోజనాలు చేశారు. సత్యం వేడుకల సందర్భంగా మంగళవారం కుభీర్ లో జాతర సందర్భంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రతోపాటు నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
జాతరలో రంగులరాట్నం వివిధ రకాల ఆహ్లాదాలను పంచే ఇన్స్ట్రుమెంట్స్ చిన్నారులను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ విట్టల్ రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, ఆలయ కమిటీ చైర్మన్ పెంటాజీ, మున్నూరు కాపు, యాదవ సంఘం అధ్యక్షుడు చిమ్మన్ అరవింద్, కందూర్ దత్తాత్రి, నాయకులు బయట విట్టల్, పుప్పాల పిరాజి, బచ్చు ప్రసాద్, గంగాధర్ పటేల్, బొప్ప నాగలింగం, బోయిడి దత్తాత్రి, ఆయా గ్రామాల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు.

Saptah1



Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి