సారంగాపూర్, జనవరి 31 : నిర్మల్ జిల్లా సారంగాపూర్(Sarangapur) మండల బీజేపీ పార్టీ(BJP) అధ్యక్షుడిగా చించోలి గ్రామానికి చెందిన కాల్వ నరేష్ నియమితులయ్యారు. బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేష్ రెడ్డి నివాసంలో కాల్వ నరేష్ ను బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టపడి పని చేస్తానన్నారు. బేజేపీ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇదివరకే సారంగాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించారని పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు.
అలాగే మండలానికి ఎమ్మెల్యే ద్వారా మరిన్ని నిధులను మంజూరు చేయించి ప్రతి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని, రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల వంటి పథకాల్లో అర్హులకు అందడం లేదన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ గౌడ్, మెడిసిమ్మరాజు, కరిపే విలాస్, దయాకర్ రెడ్డి, మధు, రంజిత్, నర్సయ్య, విజయ్, తదితరులు పాల్గొన్నారు.