కుభీర్, జూలై 19 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని చాత గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే.. చాత గ్రామానికి చెందిన పూజారి శాంతా బాయికి చెందిన రేకుల ఇంట్లో మధ్యాహ్నం విద్యుత్ స్తంభం నుండి ఇంటిలోకి వచ్చే విద్యుత్ తీగెలు ప్రమాదవాశాత్తు ఒకదానికొకటి చుట్టుకోవడంతో మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్రిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి ఇల్లు కాలి బూడిదైయింది.
ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.50 వేల నగదుతో సుమారు నాలుగు లక్షల ఆస్తి కాలిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.