కుభీర్, డిసెంబర్ 26 : పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శువైద్యాధికారిడాక్టర్ విశ్వజిత్ పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పల్సి గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మూగ జీవాలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుభీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్ యాదవ్ గొర్రెలు, పశువులకు ఉచిత నట్టల నివారణ మందులు వేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూగజీవాల ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన కుభీర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ సాయినాథ్ ను శాలువా, పూల మాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కుభీర్ పవిశ్వజిత్ పటేల్, సిబ్బంది పోశెట్టి, పుప్పాల అవినాష్, శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.