కడెం : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ఖానాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆమె ఖానాపూర్లో ఇదివరకు జరిగిన అభివృద్ధి, మరింత అభివృద్ధి కోసం నిధుల విషయమై మాట్లాడారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వంతెనలు కొట్టుకుపోయి తీవ్రనష్టం జరిగిందని, ఇంద్రవెల్లి-సిరికొండ మండలాల మధ్య ఉన్న దస్నాపూర్ వంతెన తెగిపోవడం వల్ల వాగులో ఓ మహిళ వాహనంతో సహా గల్లంతైన విషయాన్ని గుర్తు చేశారు.
ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామ పంచాయతీలోని రెంకోనా వాగు ఉధృతంగా ప్రవహించడంతో 18 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయని వీటికి వంతెనల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. జన్నారం మండలంలో ఐటీఐ కళాశాల మంజూరై టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి బడ్జెట్ రాక పనులు నిలిచిపోయా యని,మండలకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కోరారు.