నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్ 12 : కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వైద్య సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకుడు ప్రతాప్ సంపత్ పేర్కొన్నారు. నిర్మల్‌లోని రాం నగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలోని బోయవాడలో, బస్‌డిపో సమీపంలో చేపట్టిన ఇంటింటా సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కుష్ఠు వ్యాధి సోకితే ఆందోళన చెందవద్దన్నారు. చికిత్స ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుం దన్నారు. ఇంటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమ నిర్వహణ అధికారి రవీందర్ రెడ్డి, డీపీఎంవోలు వినోద్, రాజేశ్వర్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు
విద్యార్థులు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించవద్దని మెడికల్ ఆఫీసర్ రాంపెల్లి రమేశ్ పేర్కొన్నారు. సోమవారం నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 100 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్ర మంలో ఫార్మాసిస్ట్ సుచరిత, ఏఎన్ఎం అనిత, కళాశాల ప్రిన్సిపాల్ రవి కిరణ్, ఎన్ఎస్ఎస్ పీవో విష్ణు వర్ధన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
సకాలంలో వైద్య సేవలందించాలి
గర్భిణులు, పిల్లలకు సకాలంలో వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కో-ఆర్డినేటర్ వినోద సూచించారు.మండలంలోని గొడిసెర్యాలలో సోమవారం ఆమె పర్యటిం చారు. గర్భిణులు, పిల్లల ఇంటికి వెళ్లి మాతా శిశు సంరక్షణ కార్డును పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న వైద్య సేవలపై ఆమె ఆరా తీశారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణులకు వ్యాక్సినేషన్లకు ఎప్పటికప్పుడు సకాలంలో ఇవ్వా లని సూచించారు. గర్భిణులకు సాధారణ ప్రసవా లపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హెచ్వీ లలిత, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
పిల్లలకు తల్లిదండ్రులు పౌష్టికాహారాన్ని అందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆర్బీఎస్కే డాక్టర్ నాగారాజు సూచించారు. మండలంలోని మున్యాల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశా లలో విద్యార్థులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మొత్తం 92 మంది పిల్లలకు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు బాలకృష్ణ, వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు