నిర్మల్ టౌన్, జూన్ 19 : స్వరాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలో ని గండి రామన్న దత్తసాయి ఆలయంలో సాయిబాబా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఆదివా రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐదు రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర ప్రా రంభించారు. అంతకుముందు సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీ తరహాలో గండి రామన్న ఆలయ అభివృద్ధికి కృషి చే స్తున్నట్లు తెలిపారు. దత్తాత్రేయ విగ్రహాలను జైపూ ర్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు గండిరామన్న ఆలయాభివృద్ధికి రూ.1.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో గండి రామన్నను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చె ప్పారు. ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గండి రామన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ముగిసిన ‘డ్యాన్స్’ ఉత్సవాలు..
నిర్మల్ జిల్లాలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాత్రి వెన్నెల నృత్యోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్యాన్స్ అకాడమీ ఏర్పాటు చేసి 14 ఏండ్లు పూర్తి చేసుకు న్న సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అకాడమీ మాస్టార్ ధన్‌రాజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సం దర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కవులు వెంకట్, పోలీస్ భీమేశ్, తొడిశెట్టి పరమేశ్వర్, జోసెఫ్ బాబురావు, మహేశ్వరి, మహేశ్ పాల్గొన్నారు.
ఆయిల్ పాం సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో ఉన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో ప్రయోగాత్మక ఆయిల్‌పాం మొక్కల సాగును ఆదివారం ఆయన ప్రారంభించారు. వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 13 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీ కారం చుట్టిన మంత్రి.. ఆయిల్‌పాం సాగు ప్రాధాన్యతను రైతులకు వివరించా రు. నిర్మల్ జిల్లాలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీని ఏర్పా టు చేస్తామని చెప్పారు. అనంతరం హెచ్డీ పత్తి విత్తన బ్యాగులను ఆవిష్కరించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలను అందజేశారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రాంరెడ్డి, అల్లోల సతీమణి విజయలక్ష్మి, మంత్రి సోదరులు సురేందర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, జిల్లా ఉ ద్యానవనశాఖ అధికారి శ్యాంరావ్ రాథోడ్, సర్పం చ్ ఎల్చల్ గంగారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు సాయారెడ్డి, వినోద్, ఏవో ప్రవీణ్‌కుమార్, మండల కన్వీనర్ మోహినొద్దీన్, రైతులు పాల్గొన్నారు.
ఆరోపణలు అర్థరహితం
తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పాం సాగుచేస్తుంటే మాజీ ఎ మ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అర్థం లేని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తున్నదని, అందులో భాగంగా స్వయంగా తాను సాగు చేస్తుంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. తాను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్లు నిరూపించాలని పేర్కొన్నారు.
విద్యా రంగానికి పెద్దపీట
విద్యా రంగానికి సీఎం చంద్రశేఖర్ రావు పెద్దపీట వేస్తున్నారని, ప్ర భుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభు త్వ పాఠశాలల ఆవశ్యకత, ‘మన ఊరు-మన బడి’ ప్రాధాన్యతలను వివరిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు రూపొందించిన ‘మన ఊరు-మన బడి’ షార్ట్ ఫిల్మ్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్ర భుత్వ విద్యాలయాల్లో సీఎం కేసీఆర్ పెను మా ర్పులు తీసుకొచ్చారని తెలిపారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలను వీడుతూ వేలాది మంది సర్కారు బడుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. తాను కూడా సర్కారు బడిలోనే చదివి ఈ స్థాయికి వ చ్చానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా షార్ట్ ఫిల్మ్ తీసిన ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వ ర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డాక్టర్ కృష్ణంరాజు, దర్శకుడు, నిర్మాత గట్టు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అన్సార్, రవి, అనిల్, అశోక్, నటులు మేరీ, శోభ, వినయ్ పాల్గొన్నారు.
‘ఎల్కే ఇన్’ హోటల్ ప్రారంభం
నిర్మల్ అర్బన్, జూన్ 19 : నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతీ గ్రూప్‌నకు చెందిన ‘ఎల్కే ఇన్’ హోటల్‌ను రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారంప్రారంభించారు. అనంతరం హోటల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్ యజమాని ఆమెడ కిషన్, ఆమెడ రాజేశ్ మంత్రిని శాలువాతో సన్మానించారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి- రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.