హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి..
మున్సిపల్ అధికారులకు నిర్మల్ కలెక్టర్ సూచన
నిర్మల్ టౌన్, ఆగస్టు 25 : పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని పురపాలక శాఖ అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం పట్టణ ప్రగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చేపట్టిన డంప్‌యార్డు, సెగ్రిగేషన్ పట్టణ ప్రగతి వనాలు తదితర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు తరలించాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ అకౌంట్స్, ట్యాక్స్ వసూళ్లు తదితర వాటిని పక్కా ప్రణాళికతో పర్యవేక్షించాలన్నారు. వచ్చే నెల 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యం లో పట్టణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రా లు, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది పర్యవేక్షించాలని సూచించారు. నిర్మల్, భైంసా, ఖా నాపూర్ కమిషనర్లు ఎంఏ అలీం, గంగాధర్, మే నేజర్ భుజంగ్‌రావు, టీపీ సుమలత, అధికారు లు నాగేశ్వర్రావు, స్వామి, రవీందర్ పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు చేపట్టాలి..
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అంగన్వాడీ టీచర్లకు కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత, డెంగీ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేం ద్రాల్లో, పాఠశాలల్లో శానిటైజ్ చేయాలని, మౌ లిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డెంగీ వ్యాప్తి చెందకుండా మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భిణుల హాజరు పక్కాగా ఉండాలని, వారి ఆరోగ్య స్థితిగతులపై వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ వీసీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్రవంతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.