ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న నిర్మల్ జిల్లా
ఇప్పటి వరకు 435 దేవాలయాల నిర్మాణం
రూ.50 కోట్ల సీజీఎఫ్ నిధులతో పనులు
మరో 151 నిర్మాణాలకు రూ.28 కోట్ల ప్రతిపాదనలు
నిర్మల్ అర్బన్, ఆగస్టు 22;నిర్మల్.. ఆధ్యాత్మిక జిల్లాగా వెలుగొందుతున్నది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో ఆయా చోట్ల ప్రజల విన్నపాలకు అనుగుణంగా కొత్త ఆలయాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో435 చోట్ల నిర్మాణాలను ప్రారంభించగా, 350 ఆలయాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కూడా పనులు వడివడిగా సాగుతున్నాయి. గ్రామాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ ఆలయాలను నిర్మిస్తుండగా, ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మికతతో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
నిర్మల్ జిల్లాలో భక్తులకు ఆధ్యాత్మిక వాతావారణం కల్పించేందుకు ఆలయాల నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎప్పటికప్పుడు వాటి నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారుల ద్వారా తెలుసుకుంటూ వెంటనే పూర్తి చేయిస్తున్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నై వేద్యాలతో నిత్యం పూజలు నిర్వహించేలా తీర్చిదిద్దారు. జిల్లాలో గతం లో, ఇటీవల నిర్మించిన ఆలయాలను కలుపుకొని దాదాపు 900 ఆలయాలు ఉండగా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆలయాలు కలిపి వీ టి సంఖ్య 1114కి చేరనుంది.
దేవాలయాల నిరాణంపై అమాత్యుడి దృష్టి
ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణాలపై, వాటి అభివృద్ధిపై గత ప్రభుత్వాలు వివక్ష చూపాయి. స్వరాష్ట్రంలో ఆ శాఖ మంత్రి పదవి అల్లోలకు దక్కడంతో దేవాలయాల నిర్మాణాలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లో కూడా కొత్త ఆలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు ఫస్ట్, సెంకడ్ ఫేజ్లో రూ. 50 కోట్ల సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధులతో 435 ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. ఇందులో 350 ఆలయాల నిర్మాణాలు పూర్తయి, పూజలు కొనసాగుతున్నాయి. 85 ఆలయాల నిర్మాణం చి వరి దశలో ఉంది. ఇవి కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 81 ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉం డగా కరోనా కారణంగా వాయిదా పడగా, వీటి పనులను త్వరలో ప్రారంభించనున్నారు. థర్డ్ ఫేజ్లో భాగంగా జిల్లాలోని 19 మండలాల్లో 151 ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. వీటి నిర్మాణాలకు గాను రూ. 27. 92 కోట్ల వ్యయాన్ని ఖర్చుచేసి త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాలో మొత్తం ఆలయాల సంఖ్య 1312కు చేరుకోనున్నాయి. ప్రస్తుతం గతంలో ఉన్న ఆలయాల సంఖ్య కంటే నూతనంగా నిర్మించే ఆలయాల సంఖ్య నే ఎక్కువ కావడం విశేషం.
ఆధ్యాత్మిక క్షేత్రంగా నిర్మల్ జిల్లా
బాసర సరస్వతీ, కదిలి పాపహరేశ్వర, అడెల్లి పోచమ్మ, బూర్గుపల్లి రాజరాజేశ్వర, నందిగుండం దుర్గామాత, బంగల్పేట్ మహాలక్ష్మీ, దేవరకోట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయా ల్లో ఏటా ఉత్సవాలను నిర్వహించడంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పాటు కొత్తగా నిర్మించిన ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందుతున్నది.
మంత్రి అల్లోల చొరవ వల్లే..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చొరవ వల్లే ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం. జిల్లాలో అనేక ఆలయాలు నిరాదరణకు గురయ్యాయి. వీటిని ప్రస్తుతం అభివృద్ధి చేయగా, ధూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా 355 ఆలయాలు పూర్తికాగా, మరిన్ని ప్రతిపాదనలు పంపాం.
-రంగు రవి కిషన్, ఆలయాల ఇన్స్పెక్టర్
భక్తి భావం పెరుగుతున్నది.
జిల్లాలో పెద్దలతో పాటు యువతలో కూడా భక్తి భావం పెరుగుతున్నది. గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రతి వార్డులో కొత్త ఆలయాలను ని ర్మించాం. యువతను వ్యసనాల వైపు వెళ్లకుండా ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నాం.
-అంబేకర్ దత్తాద్రి, ఆలయ సేవకుడు
నిర్మల్ పట్టణంలోని చింతకుంట వాడలో అతి పురాతన మై న హింగులంబిక, హనుమాన్ ఆలయం శిథిలావస్థకు చేరి నిరాదరణకు గురైంది. కాలనీవాసులు ఆలయ పునర్నిర్మాణానికి విన్న వించడంతో వెంటనే స్పందించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హింగులంబిక ఆలయ నిర్మాణానికి రూ. 15 లక్షలు, హనుమాన్ ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయడంతో, పనులు పూర్తై ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ కాలనీలోని మహాలక్ష్మీ ఆలయంలో విజయ దశమి వేడుకలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన దాదాపు 60 వేల మందికి పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుని రావణ దహనాన్ని తిలకిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ విస్తరణ పనులకు రూ. కోటి మంజూరు చేశారు. త్వర లో పనులు ప్రారంభించనున్నారు.