ఆధ్యాత్మికతతోనే యువత సన్మార్గంలో నడుస్తారు..
ఆలయ పునఃప్రతిష్ఠాపనలో మంత్రి అల్లోల
నిర్మల్ అర్బన్, ఆగస్టు 19 : ఫొటోగ్రాఫర్ల శ్రమ వెలకట్టలేనిదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరదలు, కరువు, ఉద్యమాలు, పోరాటాలను సమాజానికి తెలపాలన్న తపన ఫొటో గ్రాఫర్లలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, విషాద సన్నివేశాలు, వెలకట్టలేని దృశ్యాలను ఫొటో పదిలంగా ఉంచుతుందని తెలిపారు. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చని పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ
సోన్, ఆగస్టు 19 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాతే దేవాలయాలకు మహర్దశ ఏర్పడుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం తల్వేద గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రభు త్వ నిధులతో 500కు పైగా దేవాలయాలను ని ర్మించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగినప్పుడే యువత సన్మార్గంలో నడుస్తుందన్నారు.
డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలి..
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని మంత్రి అల్లోల అన్నారు. సోన్ గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన రూ.14.11లక్షలతో నూతనంగా నిర్మించిన మీటింగ్ హాల్, శ్రీసాయి మున్నూరుకాపు సంఘ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోన్ మం డలం ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి చెందు తుందన్నారు. మీటింగ్ హాల్ నిర్మాణంతో ప్రభు త్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని పేర్కొ న్నారు. శ్రీ సాయి మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణంతో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముం దుకెళ్లాలన్నారు. ఈ సంఘ భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మంజులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదాముత్యంరెడ్డి, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సాద విజయ్‌శేఖర్, సోన్, తల్వేద సర్పంచ్‌లు టీ వినోద్, అనిల్, నాయకులు ఎల్చల్ గంగారెడ్డి, వెంకాయిగారి శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్, శ్రీనివాస్, గాండ్ల విలాస్, అబుద్, గంగాధర్, జగన్, మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.