ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
త్వరలోనే అందించేందుకు కృషి
ఉట్నూర్‌లో 500 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక
ఉట్నూర్, ఆగస్టు18: ఏజెన్సీలో గిరిజనేతరులకు రైతుబంధు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని తిరుమల ఫం క్షన్ హాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో పట్టణాని కి చెందిన కాంగ్రెస్ నాయకుడు జాదవ్ శ్రీరాంనాయక్ 500 మంది అనుచరులతో టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు అంబేద్కర్ చౌక్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు ర్యా లీగా వచ్చి గిరిజన సంప్రదాయ నృత్యాల మధ్య ఘన స్వా గతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సుమా రు 33వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఏజెన్సీ అభివృద్ది కండ్ల ముందే కనిపిస్తున్నదన్నారు. గిరిజనులకు మౌలిక వసతులు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూసుకుంటున్నదని స్పష్టం చేశారు. ఏజెన్సీలోని ఎస్సీలకూ దళితబంధు అందేలా చూస్తామని చెప్పారు. ఆదివాసులను కాల్చి చంపిన కాంగ్రెస్, ఇంద్రవెల్లిలో సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి సభ ద్వారా సామాన్య జనాలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ ఏజెన్సీలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు. మాజీ ఎంపీ జీ నగేశ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కేరావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నాయకుడు రాంకిషన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్, మండల అధ్యక్షుడు భరత్, రైతుబంధు మండలాధ్యక్షుడు అహ్మద్ అజీం, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్‌రావు, నాయకులు సుమన్‌బాయి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ కమ్యూనిటీ భవనానికి భూమిపూజ
శాంతినగర్‌లో కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే రేఖానాయక్ బుధవారం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే నిధులు రూ. 5 లక్షలతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
స్వరాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి
సారంగాపూర్, ఆగస్టు 18: స్వరాష్ట్రంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అ న్నారు. సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో బుధవారం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కా ర్యక్రమానికి హాజరయ్యారు. అంతుకుముందు మంత్రికి వాయిద్యాలతో ఘన స్వాతగం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జామ్ గ్రామంలో బీరప్ప ఆలయానికి రూ. 10లక్షలు, మహాలక్ష్మీ ఆలయానికి రూ. 10లక్ష లు, గుట్టపోచమ్మ ఆలయానికి రూ. 10లక్షలు, రామాలయానికి రూ. 10లక్షలు నిధులు మంజూరు చేసి సర్వాంగ సుందరగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
స్వర్ణ ప్రాజెక్టును సందర్శన..
మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును బుధవారం మంత్రి ఇం ద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. గేట్లను, నీటిమట్టాన్ని పరిశీ లించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఇటీవల భారీ వర్షాలకు గేట్లు తెరువగా, పలు గ్రా మాలు జలమయమై తీవ్ర నష్టం వాటిల్లిందని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు తెరిచే సమయం లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. జడ్పీచైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మి, ఈఈ రామారావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు నల్లావెంకట్రాంరెడ్డి, మంత్రి సో దరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రె డ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగరవీందర్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మహిపాల్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఎంపీటీసీలు భోజారెడ్డి, వ నజ మహిపాల్, ఇరిగేషన్ డీఈ అనిల్, ఏఈ మధుపాల్, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, కండెల భోజన్న, మధుకర్‌రెడ్డి, దేవిశంకర్, ఆది, మల్లేశ్, తెడ్డు మహేందర్, గడ్డల నరేశ్, బోసాని భోజన్న, ఇజాజ్, టెంబరేని భోజన్న, వీరన్న, నర్సయ్య, గంగయ్య, శ్రీధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.